Secunderabad: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. ఎమ్మెల్యే

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ కంటోన్మెంట్ పార్క్‌లో ‘తొంభై తొమ్మిది రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

SRIKANTH, TANDUR
Published on: 29 May 2026 6:55 PM IST
Secunderabad
X

Secunderabad: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. ఎమ్మెల్యే

Secunderabad: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తుందని కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేష్ తెలిపారు..పికెట్ కంటోన్మెంట్ పార్క్ లో అధికారులు ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల నుండి లోన్స్ తీసుకునే మహిళా వ్యాపారులకు చెక్కులను అందజేశారు..అలాగే ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ చీరలను కూడా లబ్ధిదారులకు ఏం ఎల్ ఏ శ్రీగణేష్ అందజేశారు..బి ఆర్ ఎస్ సర్కార్ ఇచ్చిన మహిళా లోన్స్ అరకొరగా ఉండేవని అవి కూడా వ్యాపారం చేయలేక మహిళలు ఇంటి ఖర్చుల కోసం ఖర్చు చేసుకునేవారని,ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అధికంగా లోన్స్ ఇప్పించి వ్యాపారం చేసుకొని మహిళలు కోటీశ్వరులు కాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ఏం ఎల్ ఏ శ్రీగణేశ్ తెలిపారు..అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏం ఎల్ ఏ శ్రీగణేష్ స్పష్టం చేశారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story