Secunderabad: బోయిన్ చెరువులో ఘనంగా ఛట్ పూజ వేడుకలు

Secunderabad: సికింద్రాబాద్‌లోని బోయిన్ చెరువు బతుకమ్మ కుంటలో బోయిన్‌పల్లి బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛట్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 15 Nov 2026 11:14 PM IST
Secunderabad
X

Secunderabad: బోయిన్ చెరువులో ఘనంగా ఛట్ పూజ వేడుకలు

సికింద్రాబాద్: బోయిన్‌పల్లి బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయిన్ చెరువు బతుకమ్మ కుంటలో చట్ పూజ వేడుకలను బీహార్ సోదరులు, కమిటీ సభ్యులు కలిసికట్టుగా అంగరంగ వైభవంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ హాజరై చట్ పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీహార్ సోదరులకు చట్ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంప్రదాయాలు, సంస్కృతి, ఐకమత్యాన్ని చాటిచెప్పే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీహార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి రామ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ఉత్తం యాదవ్, వినోద్ గుప్తా, సుభాష్ యాదవ్, దశరథ్ యాదవ్, రన్బీర్ యాదవ్, నరేందర్ యాదవ్ తదితర కమిటీ సభ్యులు, బీహార్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad