Sitaphalmandi: మాణికేశ్వరి నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
Sitaphalmandi: సీతాఫల్మండి మాణికేశ్వరి నగర్‌లో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఆదం సంతోష్ కుమార్, ఓయూ సీఐ వి. దాస్. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు.
Sitaphalmandi: మాణికేశ్వరి నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు
సీతాఫల్మండి: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీతాఫల్మండి డివిజన్ మాణికేశ్వరి నగర్‌లో పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
డీసీసీ ప్రధాన కార్యదర్శి గండికోట కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆటో స్టాండ్, కమాన్, ఎస్బీఐ ఏటీఎం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, స్ట్రీట్ నంబర్ 14 కమిటీ హాల్ వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాణికేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి. దాస్ జెండా ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




