Secunderabad: కోట నీలిమపై ఓవైసీ వ్యాఖ్యలకు నిరసన
Secunderabad: డాక్టర్ కోట నీలిమపై అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ రసూల్‌పుర, పాటిగడ్డ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
Secunderabad: కోట నీలిమపై ఓవైసీ వ్యాఖ్యలకు నిరసన
సికింద్రాబాద్: కాంగ్రెస్ పార్టీ సనత్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సనత్‌నగర్ కాంగ్రెస్ నాయకులు రసూల్‌పుర సర్కిల్, పాటిగడ్డ వద్ద నిరసన తెలిపారు.
ఒక మహిళా నాయకురాలిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనని, ఓవైసీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.




