Mylargadda: మైలర్‌గడ్డలో అన్నప్రసాద వితరణ: సామల హేమ
Mylargadda: సికింద్రాబాద్ మైలర్‌గడ్డలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సామల కుటుంబం, ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో మాజీ కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు.
Mylargadda: మైలర్‌గడ్డలో అన్నప్రసాద వితరణ: సామల హేమ
సికింద్రాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా మైలర్‌గడ్డలో సామల కుటుంబం మరియు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామల హేమ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా సామల హేమ మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు.
ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలకు సేవ చేయడం తమ కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి కరాటే రాజు, గడ్డం అశోక్, శ్రీధర్, సాయి కుమార్ తదితరులు సహకరించారు.ఈ కార్యక్రమంలో సందీప్, శ్యాం, చిట్టి, శైలేందర్, మధు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




