Secunderabad: బ్రాండెడ్ లిక్కర్ లో 'కల్తీ' కిక్కు.. ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి!
Secunderabad: సికింద్రాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ భారీ దాడులు నిర్వహించి నకిలీ ప్రీమియం మద్యం విక్రయిస్తున్న ముఠాను పట్టుకుంది.
Secunderabad: బ్రాండెడ్ లిక్కర్ లో 'కల్తీ' కిక్కు.. ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి!
Secunderabad: మామూలు లిక్కర్ తాగితే ఏముంటుంది అన్నా.. ప్రీమియం బ్రాండెడ్ లిక్కర్ తాగితే మంచి కిక్ వస్తుందన్నా.. ప్రీమియర్ లిక్కర్ కూడా మనకు మామూలు లిక్కర్ ధరలోనే మనకు లభిస్తుందన్న అంటూ నమ్మ బలికి ప్రీమియం లిక్కర్ లో సాధారణ లిక్కర్ కలిపి ఫంక్షన్లలోనూ తెలిసినా..బడా బాబులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్న ఒక ముఠాను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ టీం సిఐ సావిత్రి సౌజన్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు..
వివరాల్లోకి వెళితే..
లిక్కర్ మిక్సింగ్ జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు సికింద్రాబాద్ ఎక్సైజ్ డిటిఎఫ్ సీఐ సావిత్రి సౌజన్య, టీం సిబ్బంది కలిసి రసూల్ పుర మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద 6 ఆరు శివాజీ రీగల్ ప్రీమియం లిక్కర్ బాటిల్ లభించాయి. వాటిని పరిశీలించగా ప్రీమియం లిక్కర్ బాటిల్ లో తక్కువ ధర కలిగిన మద్యం మిక్సింగ్ చేసినటువంటి గా చేసినట్లుగా ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై నిందితులను ప్రశ్నించినప్పుడు.. అసలు విషయం వెల్లడించారు. మాదాపూర్ లోని మిక్సింగ్ లిక్కర్ తయారీ ప్రాంతానికి నిందితులతో వెళ్లారు.
లిక్కర్ మిక్సింగ్ ప్రాంతంలో 41 ఫుల్ బాటిల్స్ మిక్సింగ్ చేసినటువంటి శివాజీ రీగల్ మద్యం బాటిల్ ఉన్నాయి. మిక్సింగ్ మద్యం నింపడానికి వివిధ రకాలైన హై క్వాలిటీ ప్రీమియం లిక్కర్ బాటిల్స్ 63 లభించాయి. చివరకు రూ. 25 వేల విలువ కలిగిన రాయల్ సెల్యూట్ లాంటి మద్యం బాటిల్ ని కూడా ఈ ముఠా మిక్సింగ్ మద్యంతో నింపి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నాట్టు ఎక్సైజ్ విచారణలో వెల్లడయింది.మిక్సింగ్ లిక్కర్ దందా ముఠాలో చికున్ స్వాయిన్, సోను మహంతి, ప్రపుల్ కుమార్ నాయక్ ఉన్నట్లు సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు.
ఈ మిక్సింగ్ లిక్కర్ ముఠాను పట్టుకున్న టీంలో సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సావిత్రి సౌజన్య ఎస్ఐ శివరామకృష్ణ,హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ జనార్ధన్ రిశ్వాన్, సిద్ధిఖీ, అనుషాలు ఉన్నారు. ఈ కేసులో చికున్ స్వాన్, సోను మహంతులను అరెస్ట్ చేశారు. ప్రపుల్ కుమార్ నాయక్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరి. ఏఈఎస్ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులను మిక్సింగ్ లిక్కర్ను కాళీ బాటిల్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.




