Secunderabad: భారీగా రికవరీ అయిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు!

Secunderabad: సికింద్రాబాద్‌లో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రూ.2.16 కోట్ల విలువైన 1,620 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.

Srikanth, Secunderabad
Published on: 10 Sept 2026 7:28 AM IST
Secunderabad
X

Secunderabad: భారీగా రికవరీ అయిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు!

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే ప్రయాణాల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు భారీ ఎత్తున రికవరీ చేశారు. CEIR పోర్టల్ ద్వారా రూ. 2 కోట్ల 16 లక్షల విలువైన 1620 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధిత ప్రయాణికులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.19 ఏప్రిల్ 2023న CEIR పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి, తెలంగాణ జీఆర్పీ ప్రత్యేక బృందాలు మీ-సేవ ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ ఫోన్లను ట్రాక్ చేశాయి.

కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా 8 రాష్ట్రాల నుండి ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ఈ రోజు దాదాపు 120 ఫోన్లను బాధితులకు అందజేశారు.రైలు ప్రయాణంలో ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా http://ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి IMEI నంబర్ తో బ్లాక్ చేయాలని, వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ జావేద్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story