Secunderabad: ఇంపీరియల్ గార్డెన్‌లో ఘనంగా దుర్గాపూజ, దాండియా సంబరాలు!
Secunderabad: సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగిన దుర్గాపూజ, దాండియా వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, ఎంపీ ఈటెల కోడలు శమారెడ్డి పాల్గొన్నారు.
Secunderabad: ఇంపీరియల్ గార్డెన్‌లో ఘనంగా దుర్గాపూజ, దాండియా సంబరాలు!
సికింద్రాబాద్: సంస్కృతి సంప్రదాయాలతో కూడుకున్నదే మన బతుకమ్మ దాండియా పండగని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి పూజకు ముఖ్య అతిథిగా ప్రీతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం దాండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ప్రీతి రెడ్డి మామ తగ్గ కోడలిగా దాండియా పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేశారు.
యువత పెడదారిన పట్టకుండా తల్లిదండ్రులు గురువులు చూపే మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ప్రీతి రెడ్డి కోరారు. ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కోడలు శమారెడ్డి బోడు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.




