Secunderabad: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం మన్నే క్రిశాంక్ మండిపాటు

Secunderabad: మున్సిపల్ ఎన్నికల లబ్ధికే ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ ధ్వజం.

Srikanth, Secunderabad
Published on: 21 July 2026 6:58 PM IST
Secunderabad
X

Secunderabad: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం మన్నే క్రిశాంక్ మండిపాటు

సికింద్రాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం మరోసారి జరుగుతుందని బిఅరెస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ మండిపడ్డారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నందున ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని, కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో స్వయంగా రెవిన్యూ మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో 6000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

వివాదాస్పద 157/1 సర్వే నెంబర్ లో ఉన్న 800 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ పరం చేస్తున్నారని, గతంలో ఇదే స్థలంలో పేదలకు ఇండ్లు కట్టించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రులకు వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా పేదలకు ఇండ్లు కట్టించారని, 10 వేల రూపాయల అప్లికేషన్ ఫీజు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మన్నే క్రిశాంక్ అన్నారు... రాబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలవడానికే ఈ కొత్త నాటకానికి తెర తీసారన్నారు..

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story