Secunderabad: మారేడ్‌పల్లిలో కేజీ బంగారం చోరీ కేసు ఛేదన!

Secunderabad: సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో కిలో బంగారం చోరీ కేసును పోలీసులు 3 రోజుల్లో ఛేదించారు. నిందితుడైన కార్పెంటర్ భరత్‌ను అరెస్ట్ చేసి బంగారం, రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Srikanth, Secunderabad
Published on: 27 Oct 2026 6:29 PM IST
Secunderabad
X

Secunderabad: మారేడ్‌పల్లిలో కేజీ బంగారం చోరీ కేసు ఛేదన!

సికింద్రాబాద్: సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేజీ బంగారం చోరీ కేసును మూడు రోజుల్లో పోలీసులు చేదించారు. ఇంట్లో ఉన్న వారంతా పని నిమిత్తం ఖమ్మం వెళ్లి వచ్చేసరికి, బీరువాలో ఉండవలసిన బంగారం నగదు దొంగతనంకు గురయింది, ఇంటి తాళం పగల వట్టి ఉండడంతో వెంటనే మారేడ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు గాలించి, ఆ ఇంట్లో గతంలో పనిచేసిన కార్పెంటర్ భరత్ ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతని అరెస్ట్ చేసిన పోలీసులు కేజీ 18 గ్రాముల బంగారం, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad