Secunderabad: సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన వైద్యం తల్లి, బిడ్డ క్షేమం
Secunderabad: సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యుల చొరవ. కేవలం 25 వారాలకే పుట్టిన పసికందుకు 90 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన వైనం.
Secunderabad: సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన వైద్యం తల్లి, బిడ్డ క్షేమం
సికింద్రాబాద్: ఇరువై అయిదు వారాల్లో మదర్ డెలివరీ కావడం అరుదైన సంఘటనగా మెడికవర్ ఆస్పత్రి గైనిక్ డాక్టర్స్ తెలిపారు.. అనారోగ్యంతో ఓ మహిళ సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ కు రాగా టెస్టులు చేయగా ఆమె కడుపులో ఇన్పెక్షన్స్ గుర్తించామని,వాటి వల్ల తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదంగా భావించి కౌన్సిలింగ్ చేశానిమని డాక్టర్లు తెలిపారు.
మహిళ భర్త తోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో తొమ్మిది కాకుండా ఆరు నెలలకే కాన్పు చేయాల్సి వచ్చిందని డాక్టర్లు తెలిపారు.
డెలివరీ అయిన తరువాత తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని,తొంభై రోజుల వరకు పసి బిడ్డ ను ట్రీట్మెంట్ అందించి పాప శరీర భాగాలు ఇంప్రూవ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి అరుదైన చికిత్స మెడికవర్ గైనిక్ డాక్టర్లు చేయడం వల్లనే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.




