Secunderabad: ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్

Secunderabad: కంటోన్మెంట్‌లో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, బోయిన్‌పల్లి మార్కెట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్. త్వరలో జీ+1 మార్కెట్ కాంప్లెక్స్ భూమిపూజ.

Srikanth, Secunderabad
Published on: 24 July 2026 7:33 PM IST
Secunderabad
X

Secunderabad: ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్

సికింద్రాబాద్: కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించనున్న క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్.హైదరాబాద్ మహానగర పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 1 లక్ష క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తొలిదశలో నగరంలోని 16 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం కోసం మారేడ్ పల్లి మండల పరిధిలోని మహేంద్ర హిల్స్, తిరుమలగిరి మండల పరిధిలోని బోయిన్ పల్లి మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు రెవెన్యూ, హౌసింగ్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం బోయిన్ పల్లి లో నూతనంగా నిర్మించనున్న మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్.బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ లో నూతనంగా జి+1 లో కట్టనున్న 18 షాపులకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం పరిశీలించారు.

బోయిన్ పల్లి మార్కెట్ అభివృద్దికి సహకరిస్తున్న మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.త్వరలోనే జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా బోయిన్ పల్లి మార్కెట్ అభివృద్దికి అన్ని రకాలుగా సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story