Secunderabad: వెస్ట్ మారేడుపల్లిలో తలసాని ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ!
Secunderabad: వెస్ట్ మారేడుపల్లిలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని పిలుపు.
Secunderabad: వెస్ట్ మారేడుపల్లిలో తలసాని ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ!
Secunderabad: ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సంధర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్రమాదకర రంగులతో చేసిన విగ్రహాలను పూజించి నీటిలో నిమజ్జనం చేయడం వలన పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. నీరు కలుషిత అవుతుందని అన్నారు.
మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించిన వారం అవుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో కవాడిగూడ DC పుష్పలత, బన్సీలాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు నామన సంతోష్ కుమార్, కొండాపురం మహేష్ యాదవ్, మహేందర్ గౌడ్, వెంకటరమణ, లక్ష్మీపతి, గులాబ్ సింగ్, అభిషేక్, విఠల్ తదితరులు ఉన్నారు.




