Secunderabad: కేటీఆర్ జన్మదినం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

Secunderabad: సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించి, టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన తలసాని.

Srikanth, Secunderabad
Published on: 24 July 2026 2:34 PM IST
Secunderabad
X

Secunderabad: కేటీఆర్ జన్మదినం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

సికింద్రాబాద్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో విద్యార్థి నాయకుడు అత్తిలి సాయి ప్రియాన్ష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.

అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 7 సబ్జెక్ట్ లతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ లను కళాసిగూడ లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అందజేశారు.

కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి నాయకులు రాహుల్, యాసిన్, రూపేష్, మృణాల్, టింకు, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story