Secunderabad: సికింద్రాబాద్ అంగరంగ వైభవంగా మహంకాళి బోనాల జాతర

Secunderabad: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఏర్పాట్లు. జూలై 19 నుండి ఆగస్టు 5 వరకు ఉత్సవాలు. భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ.

Srikanth, Secunderabad
Published on: 14 July 2026 7:05 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ అంగరంగ వైభవంగా మహంకాళి బోనాల జాతర

సికింద్రాబాద్: ప్రభుత్వ సహకారంతో ఈ ఏడాది కూడా మహాంకాళమ్మ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఇఓ మనోహర్ రెడ్డి తెలిపారు..వచ్చే నెల రెండు,మూడు తేదీ ల్లో జరిగే మహంకాళి బోనాల పై నూతనంగా ఏర్పడిన కమిటి సభ్యులతో కలిసి ఇఓ మనోహర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమ్మవారి జాతర ఉత్సవాల పై స్పష్టత ఇచ్చారు.

ఈ నెల 19 వ తేదీన ఘటాల ఎదుర్కోలు తో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలై ఆగస్టు ఐదవ తేదీ వరకు బోనాల జారతర ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఇఓ తోపాటు కమిటి సభ్యులు తెలిపారు.

జాతర సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తుందని,బోనాలు తీసుకొచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని,సీఎం తోపాటు మంత్రులు,వీఐపీలు వచ్చే సమయాల్లో కూడా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story