Secunderabad: వారసిగూడలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు: ఘనంగా అన్నదానం!

Secunderabad: సికింద్రాబాద్ వారసిగూడలో మహ్మద్ ప్రవక్త 1501వ జయంతి సందర్భంగా ఎంజీఎం బేకరీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం. కులమతాలకు అతీతంగా పాల్గొన్న ప్రజలు, నేతలు.

Srikanth, Secunderabad
Published on: 26 Aug 2026 5:27 PM IST
Secunderabad
X

Secunderabad: వారసిగూడలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు: ఘనంగా అన్నదానం!

Secunderabad: మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు వారసిగూడ లో ఘనంగా జరిగాయి. మహ్మద్ ప్రవక్త 1501 వ జన్మదినము పురస్కరించుకుని వారసిగూడ ఎంజీఎం బేకరీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.. కుల మతాలకు అతీతంగా ఈ అన్నదానం లో పాల్గొన్నారని బేకరీ యజమాని మహమ్మద్ సాజిద్ అన్నారు.

మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గం మార్గదర్శనీయం అని, ప్రతి ఒక్కరు ఆయన మార్గంలో నడవాలని ఆయన సూచించారు. ఈ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొన్నారని, దేశ ముస్లిమ్ ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతునట్లు మహమ్మద్ సాజిద్ తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story