Kukatpally: అమ్మవారి ఆలయాల్లో కాంగ్రెస్ నేత సునీల్ ప్రత్యేక పూజలు!
Kukatpally: కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిట్ట సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
Kukatpally: అమ్మవారి ఆలయాల్లో కాంగ్రెస్ నేత సునీల్ ప్రత్యేక పూజలు!
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిట్ట సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పలారం బండి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు.
Next Story




