Serilingampally: అధికారులతో సమీక్ష నిర్వహించిన పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ
Serilingampally: అధికారులతో కలిసి నియోజకవర్గ అభివృద్ధి, రోడ్లు, నాలా పనులపై పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Serilingampally: అధికారులతో సమీక్ష నిర్వహించిన పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయం లో గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ నారాయణ్ అమిత్ మాలెంపాటి గారు, గౌరవ డీసీ శ్రీ సేవా ఇస్లావత్ గారు, గౌరవ డీసీ శ్రీ శ్రీనివాస్ గారు CMC ఇంజనీరింగ్ విభాగం, ప్రాజెక్ట్స్ విభాగం ,టౌన్ ప్లానింగ్,శానిటేషన్, UBD విభాగం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన గౌరవ PAC చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం సమగ్ర ,సంతులిత అభివృద్ది లో అధికారులు అందరూ భాగస్వామ్యం కలవాలని , నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని, ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ నిబద్ధత తో పనిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
రోడ్లు, UGD ,వరద నీటి కాల్వలు, పార్క్ లు,స్మశాన వాటిక లు వంటి అభివృద్ధి పనులలో వేగం పెంచాలని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ పనులలో అలసత్వం ప్రదర్శించకూడదు అని, ప్రజా అవసరాాల కోసం కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని, టెండర్లు పూర్తి చేయాలని, టెండర్లు పూర్తి అయిన పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన నాళాల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా నీటి నిల్వ ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని , వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని అధికారులు అందరూ సన్నద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని , అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్వయం తో పనిచేసేలా చూడాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
ఆరోగ్య శేరిలింగంపల్లి ధ్యేయంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ,ప్రజలను భాగస్వామ్యం చేయాలని, పార్క్ లను సుందర శోభిత వనంలుగా తీర్చిదిద్దాలని, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, పార్క్ లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, పిల్లలకు ఆటవిడుపు పరికరాలు, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ రహదారుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా అధికారులకు సూచనలు ఇవ్వాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని, లింక్ రోడ్ల ను ఏర్పాటు చేయాలని , రోడ్ల విస్తరణ పనులలో వేగం పెంచాలని, అధికారులకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వాలని, టౌన్ ప్లానింగ్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
శేరిలింగంపల్లి క్రీడా అభివృద్ధికి కృషి చేయాలని PJR స్టేడియం ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాల తో PJR స్టేడియం ను తీర్చిదిద్దాలని, సుమారుగా 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరి అయినవి అని PJR స్టేడియం క్రీడాకారులకు ఒక వరంగా ఉపయోగపడేలా చూడాలని, క్రీడాకారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు
ఈ కార్యక్రమంలో AMC ప్రేమ్ కుమార్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE శిరీష, EE వశిధర్, DE ఆనంద్, DE శ్రీదేవి, AE లు ప్రశాంత్, ,ప్రతాప్, భాస్కర్, రషీద్, ప్రాజెక్ట్స్ DE శిరీష,AE శివ కృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారులు ACP సురేందర్, TPS అక్బర్, TPS సుష్మ, UBD డైరెక్టర్ అమృత, UBD మేనేజర్ విక్రమ్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.




