Serilingampally: ఫీజు బకాయిల విడుదలకై బిజేపి పోరు రవికుమార్ యాదవ్ సంఘీభావం

Serilingampally: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజేపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు చేపట్టిన దీక్షకు శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ మద్దతు తెలిపారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 24 Aug 2026 7:49 PM IST
Serilingampally
X

Serilingampally: ఫీజు బకాయిల విడుదలకై బిజేపి పోరు రవికుమార్ యాదవ్ సంఘీభావం

శేరిలింగంపల్లి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు , కార్యకర్తలతో తరలి వెళ్లి సంఘీభావం తెలిపిన ..బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందన్నారు.

బకాయిలు చెల్లించకపోవడంతో పలు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదని, కొత్త అడ్మిషన్లకు కూడా ఇబ్బందులు కల్పిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు అమలు కాలేదని ఆయన విమర్శించారు. యూనివర్సిటీలు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు.

గురుకులాల్లో ఆహారం, భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, సుమారు 150 ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో 2,000 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని, 40 మందికి పైగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు భరోసా కల్పించడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, పదాధికారులు , వివిధ మోర్చల నాయకులు , పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story