Medchal: బోర్డులపై ఎంబీబీఎస్ పేర్లు.. చికిత్స చేసేది ఆర్‌ఎంపీలేనా?
Medchal: మేడ్చల్‌లోని స్వరూప నర్సింగ్ హోమ్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Medchal: బోర్డులపై ఎంబీబీఎస్ పేర్లు.. చికిత్స చేసేది ఆర్‌ఎంపీలేనా?
మేడ్చల్: మేడ్చల్‌లోని స్వరూప నర్సింగ్ హోమ్‌పై పలు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ వైద్యుల పేర్లు ప్రదర్శిస్తూ… రోగులకు ఆర్‌ఎంపీలతో చికిత్స చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
అంతేకాదు… ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌కు సంబంధించిన రికార్డులు, విధుల్లో ఉన్న వైద్యుల వివరాలు అందుబాటులో లేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఆసుపత్రిలో వాస్తవంగా వైద్యం అందిస్తున్నది ఎవరు..? ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారా..? లేక వారి పేర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారా..?
ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో… వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రిని తనిఖీ చేసి, నిజానిజాలను నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.




