Amanagallu: శెట్టిపల్లిలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
Amanagallu: ఆమనగల్లు మండలం శెట్టిపల్లిలో సరస్వతీ దేవి పూజ అనంతరం సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య సమక్షంలో విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
Amanagallu: శెట్టిపల్లిలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
రంగారెడ్డి జిల్లా: ఆమనగల్లు మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం సరస్వతి దేవి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య సమక్షంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని స్థానికులు ఆకాంక్షించారు.




