Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నీటి తీవ్ర కొరత!

Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాలలో తీవ్రమైన నీటి కొరత. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సమ్మె, ప్రభుత్వ సరఫరా లేకపోవడంతో ఆందోళన బాట పట్టిన ఐటీ కారిడర్ హాస్టల్స్ అసోసియేషన్.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 4 Nov 2026 1:38 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నీటి తీవ్ర కొరత!

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలలో నెలకొన్న తీవ్రమైన నీటి కొరత కారణంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, హాస్టల్ నిర్వహకులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ వైఫల్యం మరియు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సమ్మె కారణంగా రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.

తెలంగాణ స్టేట్ ఐటీ కారిడర్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి పీ.ఎస్.ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కరుణాకర్, సభ్యులు నాగిరెడ్డి లు మాట్లాడుతూ

ప్రభుత్వ సరఫరా నామమాత్రం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ (HMWSS) ద్వారా కేవలం 10 శాతానికి మించి నీరు సరఫరా కావట్లేదని, అది కూడా రోజు విడిచి రోజు కేవలం గంట మాత్రమే వస్తుండటంతో హాస్టళ్ల నిర్వహణ పూర్తిగా అసాధ్యంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ ట్యాంకర్ల సమ్మెతో నిలిచిన జీవనం స్థానికంగా బోర్లను ధ్వంసం చేయడం వల్ల భారీగా నష్టపోయినట్లు చెబుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో, హాస్టల్స్‌కు నీటి చుక్క కూడా అందడం లేదని బాధితులు వాపోతున్నారు. తాగునీరు లేకపోవడంతో పాటు కనీసం వంట చేయడానికి, రోజువారీ అవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొంది.

రాత్రి నుంచి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నట్లు హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రైవేట్ ట్యాంకర్ల వారు అడిగినంత డబ్బులు ఇస్తామన్నా ట్యాంకర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఒక్కో ట్యాంకర్ ధర రూ. 5,000 వరకు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య తీవ్రత కారణంగా కాలేజీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి కోవిడ్, గ్యాస్ సమస్యల తర్వాత ఇప్పుడు వాటర్ సమస్యలోనూ హాస్టల్ రంగమే ముందుగా తీవ్రంగా నష్టపోతోందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తక్షణమే జోక్యం చేసుకుని ప్రభుత్వ ట్యాంకర్ల ద్వారా లేదా ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా తగినంత నీటిని సరఫరా చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY