Shabad: గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ తరుణ్ జోషి!

Shabad: షాబాద్‌లోని పైల్వాన్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కమిషనర్ తరుణ్ జోషి పరిశీలించారు. భక్తులకు వసతులు, భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 26 Sept 2026 7:52 AM IST
Shabad
X

Shabad: గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ తరుణ్ జోషి!

Shabad: షాబాద్‌లోని పైల్వాన్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను కమిషనర్ తరుణ్ జోషి శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, పారిశుద్ధ్యం, తదితర సదుపాయాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

నిమజ్జన ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు అధికారులకు సహకరించి నిబంధనలు పాటించాలని కమిషనర్ కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ కిషన్, షాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్ఐ విజయ్, పోలీసు సిబ్బంది, సర్పంచ్ గుండాల అశోక్, ఉప సర్పంచ్ దండు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA