Shabad: షాబాద్‌లో కాంగ్రెస్ నిరసన.. ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం
Shabad: నీట్ పేపర్ లీకేజీపై షాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. మోదీ దిష్టిబొమ్మ దహనం.
Shabad: షాబాద్‌లో కాంగ్రెస్ నిరసన.. ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం
షాబాద్: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడుపల్లి పెంటారెడ్డి డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను అణచివేసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను,విద్యార్థులపై లాఠీ చార్జ్ ని ఖండిస్తూ గురువారం మండల కేంద్రంలో షాద్నగర్ - కంది జాతీయ రహదారిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను పార్టీ నాయకుల తో కలిసి దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించి, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు ఆదేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే తొలగించాలన్నారు.
అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకమైన పరీక్షా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు విద్యార్థుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మల్లేష్, తమ్మలి రవీందర్, వెంకట్ రెడ్డి, గడ్డం చంద్రయ్య మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




