Shabad: షాబాద్‌లో మట్టి వినాయకుల పంపిణీ: హోప్ ఫౌండేషన్

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏగురి మల్లికార్జున్ భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 13 Sept 2026 8:43 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో మట్టి వినాయకుల పంపిణీ: హోప్ ఫౌండేషన్

Shabad: షాబాద్ వినాయక చవితి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ అని, ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతో ప్రారంభించడం హిందూ సంప్రదాయమని హోప్ ఫౌండేషన్ సభ్యులు ఏగురి మల్లికార్జున్ అన్నారు.

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాబాద్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హోప్ ఫౌండేషన్ సభ్యులు ఈనాడు మల్లికార్జున్ భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. స్థానికంగా తయారయ్యే మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించాలని కోరారు. హిందూ పండుగలు కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సమాజంలో ఐక్యత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు.

వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి విఘ్నాల తొలగించుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,అశోక్ ,బసవరాజ్, రాఘవేందర్ వినాయక భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA