Shabad: షాబాద్‌లో ఘనంగా మైసమ్మ బోనాల వేడుకలు

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్డ్ ఫేజ్ కాలనీలో వైభవంగా మైసమ్మ బోనాల సంబరాలు. భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన మహిళలు, పోతరాజుల విన్యాసాలు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Aug 2026 9:30 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో ఘనంగా మైసమ్మ బోనాల వేడుకలు

షాబాద్‌: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని గోల్డ్ ఫేజ్ కాలనీలో మైసమ్మ బోనాల వేడుకలు అత్యంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ వేడుకల్లో గ్రామా ప్రజలతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story