Shabad: షాబాద్ ఎమ్మార్వో అన్వర్, ఏవో విజయచంద్రకు అవార్డులు

Shabad: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు అందుకున్న షాబాద్ ఎమ్మార్వో అన్వర్, ఏవో విజయచంద్ర.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Aug 2026 11:25 PM IST
Shabad
X

Shabad: షాబాద్ ఎమ్మార్వో అన్వర్, ఏవో విజయచంద్రకు అవార్డులు

షాబాద్: 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన షాబాద్ ఎమ్మార్వో అన్వర్కు ఉత్తమ ఎమ్మార్వోగా, ఏవో దండం విజయచంద్రకు ఉత్తమ ఏవోగా అవార్డులు లభించాయి. ఈ అవార్డులను జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా వారు అందుకున్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయడం, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి ఉత్తమ అధికారులుగా ఎంపిక చేసి, కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

ఉత్తమ ఎమ్మార్వో, ఉత్తమ ఏవోగా అవార్డులు అందుకున్న అన్వర్, దండం విజయచంద్రలను అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story