Shabad: షాబాద్‌లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన

Shabad: షాబాద్ మండలంలో ఆర్కేవివై పథకం కింద విద్యార్థులకు భూసార పరీక్షలపై ప్రయోగపూర్వక అవగాహన కల్పించిన రాజేంద్రనగర్ వ్యవసాయ అధికారులు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 13 Aug 2026 9:19 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన

షాబాద్: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కెవివై) కేంద్ర ప్రభుత్వ పథకంలోని నేల ఆరోగ్య మరియు భూసార ప్రాముఖ్యతలపై రంగారెడ్డి జిల్లా భూసార పరీక్ష కేంద్రం రాజేంద్రనగర్ వ్యవసాయ అధికారులు సునీత, రాజేష్ కుమార్ గురువారం షాబాద్ మండల పరిధిలోని పీఎంశ్రీ పాఠశాల, మోడల్ స్కూల్ కు చెందిన యాబై మంది విద్యార్థులకు మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర తో కలిసి భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా భూసార పరీక్ష కేంద్రం రాజేంద్రనగర్ వ్యవసాయ అధికారులు సునీత, రాజేష్ కుమార్ మాట్లాడుతూ... భూమి యొక్క నాణ్యతను, భూమిలో ఉన్న పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కార్బన్ వంటి పోషకాలతో పాటు భూమిలోని ఆమ్లత్వం (పీహెచ్) ఎలక్ట్రికల్ కండిక్టివిటీ(ఈసీ) తదితర అంశాలు ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకునే విధానాన్ని విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా పరీక్షలు చేసి చూపించారు.

భూమిలో పెరుగుతున్న కాలుష్యాన్ని, భారీ లోహాల కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, భూమికి అవసరమైన పోషక విలువలను ఏ విధంగా అందించాలి అనే అంశాలను కూడా ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయులు రాజ్ కుమార్, రాఘవేందర్, వ్యవసాయ విస్తరణ అధికారి బాబ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story