Shabad: షాబాద్లో కుసుమ పంట సాగు మరియు సస్యరక్షణపై రైతులకు శిక్షణ!
Shabad: షాబాద్లో NMEO-OS పథకంలో భాగంగా కుసుమ పంట సాగు, సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు. వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర సూచనలు.
Shabad: షాబాద్లో కుసుమ పంట సాగు మరియు సస్యరక్షణపై రైతులకు శిక్షణ!
Shabad: షాబాద్ మండలం, షాబాద్ గ్రామములో ఈ రోజు నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ఆయిల్స్-ఆయిల్ సీడ్స్ (NMEO-OS) పథకంలో భాగంగా కుసుమ పంట సాగు విస్తీర్ణం మరియు ఉత్పాదకత పెంపొందించడం, నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం, సమగ్ర పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ పద్ధతులపై అవగాహన శిక్షణ ఇవ్వడం జరిగినది.పురుగు–తెగుళ్లను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నియంత్రించడం, రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక నికర ఆదాయం పొందేలా మార్గదర్శనం చేయడం జరిగినది.
పురుగుల నివారణ:
పేనుబంక :డైమిథోయేట్ 30 ఎస్ సి– 2 మి.లీ./లీటరు నీటికి లేదా అసిఫేట్ 75 ఎస్ పి– 1.5 గ్రా./లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ ఎల్– 0.4 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆకుతినే పురుగుల నివారణ:
ఇండాక్సాకార్బ్ 15 ఇసి– 0.3 మి.లీ. లేదా స్పైనోసాడ్ 45 ఎస్ సి– 0.15 మి.లీ. కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఎండు తెగులు నివారణ:
దీనిని తట్టుకునే రకాలు ఎ-1, ఐ.ఎస్.ఎఫ్-300, ఐ.ఎస్.ఎఫ్-123 సెలెక్షన్-15 వేసుకోవాలి. విత్తుకునే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా హార్జియానం కలిపి విత్తన శుద్ధి చేయాలి.
ఆకుమచ్చ తెగులు నివారణ:
కాపర్ ఆక్సీక్లోరైడ్ – 3 గ్రా./లీటరు నీటికి లేదా మాంకోజెబ్ – 2.5 గ్రా./లీటరు నీటికి. కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణ: మాంకోజెబ్ – 2.5 గ్రా./లీటరు నీటికి.లేదా కార్బెండజిమ్ – 1 గ్రా. + మాంకోజెబ్ – 2 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
కుసుమ పంటలో ఆకుమచ్చ, బూడిద మరియు తుప్పు తెగుళ్లు ఆశించడం వల్ల మొక్కల పెరుగుదల, పూత, గింజల అభివృద్ధి దెబ్బతిని దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర సూచించారు.
ఈ కార్యక్రమంలో షాబాద్ రైతు ఫెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సి.ఈ.ఓ కందివవనం. చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు శివతేజ, మౌనిక, రైతులు యాదవరెడ్డి , సత్యనారాయణ రెడ్డి, యాదగిరి, చెన్నయ్య, క్రిష్ణయ్య, తదితర రైతులు పాల్గొన్నారు. పథకం సమర్థవంతమైన అమలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేత లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.




