Nandigama: నందిగామలోని ఎస్కే కుర్చీల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Nandigama: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామలోని ఎస్కే కుర్చీల కంపెనీలో అగ్నిప్రమాదం. కుర్చీలు దగ్ధం, భారీగా ఆస్తి నష్టం. తప్పిన ప్రాణనష్టం.

A. SRINIVAS, 	SHADANAGAR
Published on: 12 Nov 2026 6:30 PM IST
Nandigama
X

Nandigama: నందిగామలోని ఎస్కే కుర్చీల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

నందిగామ: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామంలోని ఎస్కే కుర్చీల కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ నిల్వ ఉంచిన కుర్చీలు, ఇతర సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు సమాచారం.

అగ్నిప్రమాదాన్ని గమనించిన కార్మికులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారుల విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది..

A. SRINIVAS, 	SHADANAGAR

A. SRINIVAS, SHADANAGAR