Shahbad: షాబాద్‌లో 100% ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి రాజ్ భూపాల్

Shahbad: షాబాద్ గ్రామ పంచాయతీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ సమీక్ష. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని పిలుపు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 31 July 2026 9:08 PM IST
Shahbad
X

Shahbad: షాబాద్‌లో 100% ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి రాజ్ భూపాల్

షాబాద్: షాబాద్ గ్రామ పంచాయతీలో SIRపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ సమీక్ష షాబాద్ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో 80 శాతం SIR ప్రక్రియ పూర్తయిందని అధికారులు వివరించారు. మిగిలిన 20 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని రాజ్ భూపాల్ గౌడ్ సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా SIR ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

“ప్రతి అర్హ ఓటరుకు న్యాయం జరిగేలా 100 శాతం SIR పూర్తి చేయడమే లక్ష్యం” అని రాజ్ భూపాల్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మనేయ్య మండల అధ్యక్షుడు, కిరణ్,శ్రీధర్,రాము,కూతురు మహేందర్,జక్కని శేఖర్,హరీష్,నవీన్, రాజు,వినయ్,శ్రీశైలం లు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story