Shameerpet: శామీర్‌పేట పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం!

Shameerpet: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలో మద్యం మత్తులో కారును రాంగ్‌రూట్‌లో నడిపి కావలి మల్లేష్ అనే వ్యక్తి షేక్ జమీల్ అనే వృద్ధుడి మరణానికి కారణమయ్యాడు.

PURENDAR, ALWAL
Published on: 29 July 2026 11:16 PM IST
Shameerpet
X

Shameerpet: శామీర్‌పేట పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం!

శామీర్పేట్: మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన కారు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన షేక్ జమీల్(61) మంగళవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై కిరాణా దుకాణానికి వెళ్లి సామాన్లు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు.

ఇంటికి కొద్ది దూరంలోకి చేరుకోగానే, క్షీరసాగరం నుంచి లక్ష్మాపూర్‌కు చెందిన కావలి మల్లేష్ మద్యం మత్తులో తన కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా రాంగ్‌రూట్‌లో నడుపుతూ వచ్చి జమీల్ వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో జమీల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు.మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story