Shameerpet: బైక్ దొంగల ముఠా అరెస్ట్: 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!

Shameerpet: జల్సాల కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నల్లగండ్ల నవీన్‌తో పాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన శామీర్‌పేట పోలీసులు. 9 బైక్‌లు సీజ్.

PURENDAR, ALWAL
Published on: 18 July 2026 4:49 PM IST
Shameerpet
X

Shameerpet: బైక్ దొంగల ముఠా అరెస్ట్: 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!

Shameerpet: శామీర్ పేట ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరికి చెందిన నల్లగండ్ల నవీన్ అనే వ్యక్తి తో పాటు ముగ్గురు మైనర్ యువకులను అదుపులో తీసుకున్నట్టు తెలిపారు.నిన్న సాయంత్రం దొంగల మైసమ్మ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు నిందితున్ని విచారించడంతో బైక్ దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు.

నిందితులపై శామీర్ పేట,కీసర, కుషాయిగూడ,ఖమ్మం జిల్లా మునుగురు పోలీస్ స్టేషన్ లో కేసులున్నట్టుగా శామీర్ పేట పోలీసులు గుర్తించారు.నిందితులంతా జువైనల్ హోమ్ లో పరిచయమైనట్టు పోలీసులు నిర్ధారించారు.. నిందితుల వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు నవీన్ ను రిమాండుకు తరలించినట్టు ఏసీపీ చక్రపాణి మీడియాకు తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story