Shamshabad: బీజేపీలో చేరిన గండిపేట మండలం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
Shamshabad: రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.
Shamshabad: బీజేపీలో చేరిన గండిపేట మండలం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీజేపీ లో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు గారి చేతులు మీదుగా వారి నివాసం లో గండిపేట మండలం పుప్పాలగూడ, నెక్నాంపూర్ ప్రాంతాల్లోని పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ తమ అనుచరులతో బిజెపి లో చేరారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నూతనంగా పార్టీ లో చేరిన వారికి కాషాయ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. నెక్నాంపూర్ డివిజన్ అధ్యక్షులు తివారి విజ్ఞేశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
పిట్టల సత్యనారాయణ, గుంటి జైరాజ్, నర్సింహారావు , యాదగిరి,రాజేష్, సంపత్, రవికుమార్, సాయికిరణ్, మురళి, కార్తీక్, సందీప్, మహేష్ కుమార్, ప్రవీణ్, నవీన్ , ప్రభాకర్, రాజు, మహేందర్, కృష్ణ, సతీష్, రవికుమార్, విజయకుమార్, రాము, బెందరి వెంకటేష్ అఖిలేష్ తదితరులు కొత్తగా బిజెపి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, డివిజన్ ఇంచార్జ్ శ్రీశైలం , జిల్లా నాయకులు మల్లేష్ యాదవ్, నరేందర్ రెడ్డి ,బట్ట సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




