Shamshabad: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ దుర్మరణం!

Shamshabad: శంషాబాద్ ఈకో పార్క్ వద్ద పల్సర్ బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో లిఫ్ట్ తీసుకున్న మహిళ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.

ANJAIAH, SHAMSHABAD
Published on: 24 Oct 2026 7:44 PM IST
Shamshabad
X

Shamshabad: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ దుర్మరణం!

శంషాబాద్: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఈకో పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ నుండి శంషాబాద్ వైపు వస్తున్న పల్సర్ బైక్‌పై ఒక మహిళ లిఫ్ట్ అడిగి ఇద్దరు వస్తుండగా, వెనక నుండి వచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మహిళ ఎగిరి టిప్పర్ చక్రాల కింద పడింది. టిప్పర్ కింద పడడంతో మహిళ దేహం నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ఈకో పార్క్ సమీపంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, మరో పక్క రోడ్డు వెడల్పు పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD