Shamshabad: పాలమాకుల పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన
Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల ZPHSలో విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, POCSO చట్టంపై పోలీసుల అవగాహన.
Shamshabad: పాలమాకుల పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని పెద్దషాపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పాలమాకుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన మరియు చైతన్య కార్యక్రమం నిర్వహించారు.
రోడ్డు భద్రత: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో సీట్ బెల్ట్ ధరించడం, అతివేగంగా వాహనాలు నడపకపోవడం మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని వివరించారు.
సైబర్ నేరాలు: ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లలో వచ్చిన తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, OTPలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.
సోషల్ మీడియా భద్రత: వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వేదికలను సురక్షితంగా వినియోగించుకోవాలని, తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో పరిచయాలు పెంచుకోకూడదని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు: గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలు, విద్యార్థుల చదువు, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.
POCSO చట్టం: బాలలపై లైంగిక వేధింపులు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, అనుచిత ప్రవర్తన ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ల గురించి విద్యార్థులకు వివరించారు.
112 – అత్యవసర పోలీస్ సహాయం
1930 – సైబర్ నేరాల హెల్ప్‌లైన్
1908 – మాదకద్రవ్యాల నియంత్రణ హెల్ప్‌లైన్ ఇలాంటి నెంబర్లు విద్యార్థులు ఎప్పుడు గుర్తుంచుకోవాలని సూచించారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దషాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వై. సురేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు డి. బాలరాజు, సి. రాఘవేందర్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.




