Shamshabad: పిల్లర్ 274 వద్ద ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్

Shamshabad: రాజేంద్రనగర్ శివరాంపల్లి పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ 274 వద్ద ఆర్టీసీ బస్సు కిందకు రాపిడో బైక్ దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ANJAIAH, SHAMSHABAD
Published on: 15 Nov 2026 4:18 PM IST
Shamshabad
X

Shamshabad: పిల్లర్ 274 వద్ద ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్

శంషాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి పివీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 274 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన పల్సర్ బైక్, అతివేగమే ప్రమాదానికి కారణమైందంటున్న స్థానికులు, బైక్ పై ఓ వ్యక్తి మరో మహిళా ఉన్నట్టు స్థానికుల సమాచారం.

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తలకు గాయమైనట్లు మరో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి ఆ బైకు రాపిడో బైక్ అని చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బైక్ ఎవరిది ప్రమాదం ఎలా జరిగింది గాయపడిన వారు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD