Hyderabad: చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం
Hyderabad: చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో తీవ్ర వివక్ష జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన నటుడు, దర్శకుడు షరాజ్ మెహది.
Hyderabad: చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం
హైదరాబాద్: చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని దర్శకుడు, నటుడు,షరాజ్ మెహది ఆవేదన వ్యక్తం చేశారు.సోమాజిగూడ, ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర పరిశ్రమలో తీవ్రస్థాయిలో వివక్ష కొనసాగుతుందని అన్నారు.
కొద్ది మంది చేతుల్లోనే చిత్ర పరిశ్రమ మొత్తం నడుస్తుందని ఆరోపించారు.సినిమా రంగంపై ఆసక్తితో ఈ పరిశ్రమ లోకి అడుగుపెడుతున్న నూతన నటీనటులు దర్శక, నిర్మాతల పట్ల ఇదే రంగంలో బలపడ్డ వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు కన్నీరు తెప్పిస్తుందని అన్నారు.
తాను ఎంతో శ్రమించి నిర్మించిన ఓ అందాల రాక్షసి సినిమా కు థియేటర్లు కేటాయించాలని నెలల తరబడి వేచి చూస్తున్నట్లు చెప్పారు.సినీ ఛాంబర్ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి చిన్న సినిమా నిర్మాతలు,నటుల కు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.




