Sherlingampalli: పలహార బండి ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే!

Sherlingampalli: వెంకటేశ్వర నగర్‌లో SKM యూత్ ఆధ్వర్యంలో పలహార బండి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ రోజాదేవి పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 11 Aug 2026 11:42 PM IST
Sherlingampalli
X

Sherlingampalli: పలహార బండి ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే!

శేర్లింగంపల్లి: వైభవంగా శేర్లింగంపల్లి, వెంకటేశ్వర నగర్, SKM యూత్ ఆధ్వర్యంలో పలహార బండి కనుల పండువగా ఊరేగింపును ప్రారంభించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, వివేకానంద నగర్ మాజీ కార్పొరేటర్ రోజాదేవి, రంగారావు, పెద్ద భాస్కర్ రావు మరియు రాజకీయ నాయకులు, పలహార బండి ఊరేగింపు కనుల పండువగా సాగింది.

స్థానిక వెంకటేశ్వర నగర్ బస్తీ దవఖాన నుండి ఊరేగింపు ఆరంభమై, గణేష్ మండపం మీదుగా కట్ట మైసమ్మ ఆలయానికి చేరుకుంది. రెండు భారీ గొర్రె పొట్టేళ్లు పలహారం బండిని ముందుకు లాగాయి. బండి ముందు బాజా భజంత్రీల మధ్య యువకులు, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పోతరాజులు విన్యా ఆకట్టుకున్నాయి.

ఎల్లమ్మ అమ్మవారు, కాలిక మాత అమ్మవారు తదితర దేవతల విగ్రహాలతో కళాకారులు ఊరేగింపునకు శోభతెచ్చారు. వేలాది మంది భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. పలహారం బండి కట్ట మైసమ్మ ఆలయానికి చేరుకున్నారు.. స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈ వేడుకల ఏర్పాట్లను కాలనీ పెద్దలు ఎర్ర లక్ష్మయ్య, పల్లపు బాబు, రాంబాబు, బొమ్మ శ్రీధర్, స పర్యవేక్షించింది.

ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, అంజన్, చందు, సాక్షాత్ గౌడ్, రామకృష్ణ, బాలాజీ, సాయి, బద్రి, అంజి, మనీ, లక్ష్మణ్, రవి, విక్రమ్, అరవింద్, నిఖిల్, కనుక, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story