Secunderabad: సికింద్రాబాద్‌లో ఘర్షణ.. కార్మికుడిపై యజమాని దాడి!
Secunderabad: సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో డబ్బుల వివాదం కారణంగా బంగారు ఆభరణాల వర్క్‌షాప్ యజమాని కార్మికుడిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
Secunderabad: సికింద్రాబాద్‌లో ఘర్షణ.. కార్మికుడిపై యజమాని దాడి!
Secunderabad: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బంగారు ఆభరణాల తయారీ కర్మకారంలో ఓ కార్మికులపై మరో కార్మికుడు దాడి చేశాడు.. తలపై పదునైన పరికరంతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది.. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.. సిరిసిల్ల కు చెందిన శ్రీనివాస్ చారి జనరల్ బజార్ లోని బంగారం షాపు ఆభరణాల తయారీ వర్క్ షాప్ లో పని చేస్తున్నాడు.
తనకు రావలసిన డబ్బులపై షాపు యజమాని రాజును నిలదీశారు.. ఇద్దరి మధ్య మాట పెరిగింది.. షాపు యజమాని రాజు దాడి చేయడంతో శ్రీనివాసచారి గాయాల పాలయ్యారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




