Rangareddy: ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఆడబిడ్డలకు అండగా సింగంపల్లి సర్పంచ్!
Rangareddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సింగంపల్లి సర్పంచ్ శానమోని సత్యం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Rangareddy: ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఆడబిడ్డలకు అండగా సింగంపల్లి సర్పంచ్!
Rangareddy: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలం సింగంపల్లి గ్రామ సర్పంచ్ శానమోని సత్యం వార్తల్లో నిలుస్తున్నాడు..
సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పదవిని ప్రతిష్ఠగా కాకుండా..
ప్రజాసేవకు వేదికగా మలుచుకుంటే ఎంతటి మార్పు సాధ్యమవుతుందో సింగంపల్లి గ్రామ సర్పంచ్ నిరూపిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనాన్ని సొంత అవసరాలకు వినియోగించకుండా
గ్రామంలో పుట్టిన ప్రతి ఆడ శిశువుకు 5,016 రూపాయలు ఇచ్చి బ్యాంకులో ఫిక్స్ చేపిస్తు గ్రామ ప్రథమపౌరుని కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరిచేత మన్ననలు పొందుతున్న సర్పంచ్ సత్యం ను పలువురు
అభినందిస్తున్నారు.
గ్రామంలో పుట్టిన ప్రతి ఆడ శిశువును శుభ సూచికంగా భావించి ఆశీర్వదిస్తున్న సర్పంచ్ ..గ్రామంలోని ఆడబిడ్డ పెళ్ళికి 5 వేల 16 రూపాయలు ఆడపిల్ల కట్నంగా అందించడం సర్పంచ్ ఉదార గుణానికి గ్రామస్థులు మెచ్చుకుంటున్నారు. సర్పంచ్ చేస్తున్న సాయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సర్పంచ్ సత్యం మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వాగ్దానంతో పాటు బాలికల పట్ల గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా చిన్న ప్రయత్నం చేస్తున్నానని,
అదేవిధంగా గ్రామంలో దురదృష్టవషాత్తు మరణం సంభవించినప్పుడు బాధిత కుటుంబాలకు కొంతలో.. కొంతైనా ఆసరా అవుతుందని 5 వేలు తక్షణ సాయంగా అందిస్తున్నందుకు గ్రామ సర్పంచ్ గా నాకు సంతృప్తిగా ఉందని తెలియజేస్తూ.. ఇది నేను సర్పంచుగా ఉన్నన్ని రోజులు కొనసాగుతుందని సర్పంచ్ శానమోని సత్యం మీడియాకు తెలియజేస్తున్నారు.
గౌరవ వేతనాన్ని వినియోగించుకోకుండా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




