Veldanda: వెల్దండ రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ రైతు వేదికలో తహశీల్దార్ కార్తీక్ కుమార్, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది.
Veldanda: వెల్దండ రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ అన్నారు వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదిక లో స్మార్ట్ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ తహసిల్దార్ కార్తీక్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెల్దండ మండల అన్ని గ్రామాల సర్పంచులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డును అందజేశారు ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగ కారంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ వెల్దండ మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ ఉప సర్పంచ్ ఎర్ర శీను కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్ సర్పంచులు శ్రీనివాసులు గన్యా నాయక్ కొండల్ యాదవ్ ఈ వివిధ గ్రామాల సర్పంచులు తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది శంకర్ నాయక్ కిషన్ వివిధ గ్రామాల తదితరులు పాల్గొన్నారు.




