Hyderabad: కూకట్‌పల్లి టు గుల్బర్గా: పక్కా స్కెచ్‌తో మతం మార్పించి, ఆస్తులు ఊడ్చేసిన కేటుగాడు!

Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై లవ్ జిహాద్ ఘాతుకం. హిందువుగా నమ్మించి పెళ్లి చేసుకుని, మతం మార్పించి, ఆస్తులు దోచుకున్న నవాజ్.

Arun Chilukuri
Published on: 16 April 2026 4:00 PM IST
Hyderabad
X

Hyderabad: కూకట్‌పల్లి టు గుల్బర్గా: పక్కా స్కెచ్‌తో మతం మార్పించి, ఆస్తులు ఊడ్చేసిన కేటుగాడు!

Hyderabad: ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం.. మతం మార్పిడికి ఒత్తిడి తేవడమే కాకుండా, అందినకాడికి దోచుకుని నట్టేట ముంచిన ఒక 'లవ్ జిహాద్' ఉదంతం నగరంలో కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి తనను ఎలా మోసం చేశాడో బాధితురాలైన ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ స్వయంగా వెల్లడించారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2025 మే నెలలో నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. కూకట్‌పల్లిలో బిజినెస్ చేస్తూ ఆమె కుటుంబానికి దగ్గరయ్యాడు. తాను హిందువుగా మారిపోయానని, తన పేరును **'నవదుర్గ'**గా మార్చుకున్నానని నమ్మించేందుకు ఒక నకిలీ సర్టిఫికెట్‌ను కూడా చూపించాడు. అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు అయిన విషయాన్ని దాచిపెట్టి, ఇదే మొదటి వివాహం అని నమ్మించి గతేడాది జూలైలో బాధితురాలిని పెళ్లాడాడు.

పెళ్లయిన తర్వాత నవాజ్ అసలు రంగు బయటపడింది. దుబాయ్ వెళ్తామని నమ్మించి, వివాహం సమయంలో ఆమె పేరును నజీరాగా మార్చారు. గుల్బర్గాలోని దర్గాకు తీసుకువెళ్లి బలవంతంగా మతం మార్పించి, 'కల్మా' చదివించారు. మాట వినకపోతే తీవ్రంగా కొట్టేవారని బాధితురాలు వాపోయారు. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తూ లొంగదీసుకున్నాడు. బేగంపేటలో మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, తల్లిని, చెల్లెలిని చంపుతానని బెదిరించాడు.

నవాజ్ కేవలం మతం మార్పిడికే పరిమితం కాకుండా, ఆర్థికంగా కూడా బాధితురాలిని కోలుకోకుండా చేశాడు. శంషాబాద్‌లోని ఫ్లాట్‌ను అమ్మేశాడు. ఆమె బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టాడు. బాధితురాలి పేరు మీద అందినకాడికి లోన్లు తీసుకుని సొమ్ము చేసుకున్నాడు. అక్టోబర్ 10న బెంగళూరు వెళ్లిన సమయంలో, బాండ్ పేపర్లు తీసుకుని డబ్బు తేవాలని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

"లవ్ జిహాద్ అనేది నిజం.. హిందూ అమ్మాయిలను పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్ చేస్తున్నారు. నన్నే ఉదాహరణగా తీసుకోండి. నన్ను నమ్మించి, నా జీవితాన్ని నాశనం చేశారు" అని బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story