Madhapur: ప్రైమ్ ఫార్మసీలో ఎస్‌ఓటీ సోదాలు.. భారీగా ట్రమాడోల్ మాత్రలు స్వాధీనం!
Madhapur: అయ్యప్ప సొసైటీలోని ప్రైమ్ ఫార్మసీలో ఎస్‌ఓటీ, సైబరాబాద్ పోలీసుల సోదాలు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న 6,568 ట్రమాడోల్ మాత్రలు స్వాధీనం
Madhapur: ప్రైమ్ ఫార్మసీలో ఎస్‌ఓటీ సోదాలు.. భారీగా ట్రమాడోల్ మాత్రలు స్వాధీనం!
మాదాపూర్: అయ్యప్ప సొసైటీలోని ప్రైమ్ ఫార్మసీలో సోదాలు నిర్వహించిన SOT సైబరాబాద్, మాదాపూర్ పోలీసులు, ట్రమాడోల్ టాబ్లెట్లు సీజ్.. ఇద్దరు నిందుతుల అరెస్ట్, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న 6,568 ట్రమాడోల్ మాత్రలు (821 స్ట్రిప్స్) స్వాధీనం.
ఫార్మసీ యజమాని తోర్రి వెంకటేశం (32), డెలివరీ బాయ్ బర్లకడి శ్రీకాంత్ (32) లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నారాయణ్‌ఖేడ్‌కు చెందిన రాథోడ్ ప్రకాష్ (A-3 పరారిలో ఉన్నాడు) నుండి ఈ మాత్రలను అక్రమంగా కొనుగోలు చేసినట్లు గుర్తింపు గత కొన్ని నెలలుగా దాదాపు 100 నుండి 150 మందికి పైగా ఈ మాత్రలను అమ్మినట్లు వెల్లడి నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.
పరారీలో ఉన్న A-3 మరియు కొనుగోలుదారుల కోసం పోలీసుల గాలింపు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సైకోట్రోపిక్ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక.




