Rangareddy: పోచారంలో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్వోటీ పోలీసుల దాడి, నిందితుడి అరెస్ట్!
Rangareddy: ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో హైడ్రోజన్ పెరాక్సైడ్, మిల్క్ పౌడర్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్న నిందితుడిని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Rangareddy: పోచారంలో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్వోటీ పోలీసుల దాడి, నిందితుడి అరెస్ట్!
Rangareddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో రసాయనాలతో కల్తీ పాలు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలవ్యాపారి గుట్టును మహేశ్వరం SOT పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని పోచారం గ్రామంలో జరుగుతున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్వోటీ బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది.
ఈ దాడిలో నిందితుడు పాలలో ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్, 'ధోల్పూర్' మిల్క్ పౌడర్‌ను కలిపి కృత్రిమంగా పాలను తయారుచేస్తూ హైదరాబాద్‌లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
పోచారం గ్రామానికి చెందిన అందె శ్రీశైలం (43) అనే వ్యక్తి నుండి 100 లీటర్ల కల్తీ పాలు, 1 లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 కేజీల 'ధోల్పూర్' బ్రాండ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
లాభాపేక్షతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




