Alwal: అల్వాల్ వెంకటాపురంలో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి!

Alwal: అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెంకటాపురంలో సోమవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని పట్టుకున్నారు.

PURENDAR, ALWAL
Published on: 24 Nov 2026 10:43 PM IST
Alwal
X

Alwal: అల్వాల్ వెంకటాపురంలో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి!

అల్వాల్‌: అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెంకటాపురంలో సోమవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి విచారణ నిమిత్తం అల్వాల్‌ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL