Uppal: బేకరీలో కాలం చెల్లిన ఫుడ్ కలర్స్: ఎం-ఫాస్ట్, ఎస్ఓటీ దాడి!

Uppal: కాప్రా మిస్టర్ బేకరీలో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, సాస్‌లు గుర్తింపు. ఎస్ఓటీ, ఎం-ఫాస్ట్ అధికారుల దాడి; నిర్వాహకుడు కుషాయిగూడ పోలీసులకు అప్పగింత.

ASHOK, KAPRA
Published on: 12 Aug 2026 6:48 AM IST
Uppal
X

Uppal: బేకరీలో కాలం చెల్లిన ఫుడ్ కలర్స్: ఎం-ఫాస్ట్, ఎస్ఓటీ దాడి!

Uppal: కాలం చెల్లిన సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను ఉపయోగిస్తున్న మిస్టర్‌ బేకరీపై ఎం-ఫాస్ట్, ఉప్పల్‌ ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా దాడి చేసింది. కాప్రాలోని భవానీనగర్‌ ఆర్చ్‌ ఎదురుగా ఉన్న మిస్టర్‌ బేకరీలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆహార పదార్థాల తయారీలో గడువు ముగిసిన సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలో పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు సరిగా పాటించకపోవడాన్ని కూడా గుర్తించారు.

తనిఖీల్లో ట్రిశూల్‌ సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ గడువు ముగిసినవి 9, ఆరెంజ్‌ H-7820 BWB సింథటిక్‌ కలర్స్‌ 2, బటర్‌ స్కాచ్‌ సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ 1, ఎక్స్‌పైరీ తేదీ, లేబుల్‌ లేని మనామా బటర్‌ స్కాచ్‌ 5C సాస్‌ 1, గడువు ముగిసిన సాచర్‌ పిజ్జా పేస్ట్‌ (1 కిలో) 1, బేకర్స్‌ డిలైట్స్‌ టూటీ ఫ్రూటీ గడువు ముగిసిన 3 ప్యాకెట్లు, బుష్‌ కలర్స్‌ ఆరెంజ్‌ రెడ్‌ 3ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బేకరీ నిర్వాహకుడు రామకృష్ణను ప్రతివాదిగా పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు బేకరీ నిర్వాహకుడు రామకృష్ణను తదుపరి చర్యల నిమిత్తం కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

ఆహార పదార్థాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story