Vikarabad: ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా!

Vikarabad: వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. మహిళల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తునకు ఆదేశించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 5 Oct 2026 10:16 PM IST
Vikarabad
X

Vikarabad: ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా!

వికారాబాద్: వార్షిక తనిఖీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS సోమవారం జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను, స్టేషన్ నిర్వహణను, రికార్డుల నిర్వహణ తీరును, కేసుల దర్యాప్తు పురోగతిని, పెండింగ్ కేసుల వివరాలను, ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ దర్యాప్తు ఏ దశలో ఉందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో సత్వర స్పందన, సమర్థవంతమైన దర్యాప్తు, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నుంచి వచ్చే ఫిర్యాదులను సున్నితంగా స్వీకరించి, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని సూచించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, CCTNS, e-Sakshya తదితర పోలీస్ సాంకేతిక వ్యవస్థలను సక్రమంగా ఉపయోగించాలని సూచించారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసు డైరీలు, రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు, దర్యాప్తు పత్రాలు తదితరాలను పరిశీలించిన ఎస్పీ గారు రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ గారు పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ, స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలను కూడా పరిశీలించారు. విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రజలతో ముఖ్యంగా మహిళలతో స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

మహిళలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగేలా విమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు తమ సమస్యలను ఎలాంటి భయాందోళన లేకుండా పోలీసులను ఆశ్రయించే విధంగా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని ఎస్పీ సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ గారు వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రామ్ నాయక్, ఎస్‌ఐ అనిత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD