Vikarabad: ప్రజావాణిలో నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా!

Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన ఎస్పీ స్నేహ మెహ్రా, ప్రజల సమస్యలు విని తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 5 Oct 2026 10:13 PM IST
Vikarabad
X

Vikarabad: ప్రజావాణిలో నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా!

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను, ఫిర్యాదులను ఓపికగా విని వివరాలను తెలుసుకున్నారు.

ఫిర్యాదుదారుల సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి, చట్టపరిధిలో ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన సందర్భాల్లో ఫిర్యాదుదారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వారికి సత్వర న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని,అవసరం అయిన యడల నేరుగా తమని సంప్రదించవచ్చు అని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD