Vikarabad: జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు!

Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించిన ఎస్పీ స్నేహ మెహ్రా. వినాయక వేడుకలపై పోలీసుల కఠిన మార్గదర్శకాలు.

MOGULAIAH, VIKARABAD
Published on: 16 Sept 2026 6:59 AM IST
Vikarabad
X

Vikarabad: జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు!

Vikarabad: జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS

ఈ రోజు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జిల్లా పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని, జిల్లాలో శాంతిభద్రతలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు.

వినాయక చవితి వేడుకలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు.

వినాయక మండపాల వద్ద నిరంతరం నిఘా కొనసాగిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారిక ఆన్‌లైన్ ఇంటిమేషన్ ఫారం (Online Intimation Form) ద్వారా నమోదు చేసుకోవాలి.

మండపాల వద్ద తగినంత బారికేడింగ్, లైటింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు చేయాలి. మండపాల వద్ద విద్యుత్ వైర్లు, షార్ట్ సర్క్యూట్లు మరియు ఇతర విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఊరేగింపుల సమయంలో ఒకే ప్రాంతంలో ఒకేసారి అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా నిర్వాహకులు నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఊరేగింపుకు నిర్దేశించిన మార్గాలను మాత్రమే ఉపయోగించాలి.

పోలీసుల సూచనలు లేకుండా మార్గాలను మార్చకూడదు. డీజేలు మరియు అధిక శబ్దానికి కారణమయ్యే సౌండ్ సిస్టమ్‌లు పూర్తిగా నిషేధించబడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యానికి ఎవరూ పాల్పడకూడదు.

నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు మరియు ఇతర నీటి వనరుల వద్ద నీటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలి. పిల్లలు మరియు ఈత రాని వ్యక్తులు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం/పోలీస్ శాఖ సూచించిన నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలి.

నిమజ్జన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, ట్రాఫిక్ మరియు ఇతర శాఖల సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఊరేగింపు సమయంలో బాణాసంచా వినియోగం వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, ఫైర్ మరియు వైద్య సేవలను సంప్రదించేందుకు అత్యవసర సంప్రదింపు నంబర్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలి.

వినాయక వేడుకలు మరియు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా వేడుకల కమిటీలు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో DCRB DSP జనయ్య, DSB అధికారులు, వికారాబాద్ DSP అంజయ్య, తాండూర్ DSP ఎన్. యాదయ్య, పరిగి DSP శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD